32.7 C
Hyderabad
Monday, March 1, 2021

లాటరీ డబ్బుతో ఇతనేం చేస్తాడంటే…

ఎవరికైనా అదృష్టం ఒకసారి తలుపు తడుతుంది. అంతగా సుడి ఉంటే రెండు సార్లు.. కానీ ఏకంగా ఆరు సార్లు అదృష్టం తలుపు తట్టడం అంటే మామూలు విషయం కాదు. అమెరికాలో ఒకతను ఆరుసార్లు లాటరీలు గెలిచుకున్నాడు. రీసెంట్ గా మరో గేమ్ లో ఏకంగా రెండున్నర లక్షల డాలర్లు(182 కోట్లు) గెలుచుకున్నాడు.


అమెరికాలోని ఐడాహో రాష్ట్రానికి చెందిన బ్రియాన్ మోస్‌కు లాటరీ గేమ్స్ ఆడే అలవాటు ఉంది. అలా పలు గేమ్స్‌ ఆడి దాదాపు ఐదుసార్లు లాటరీ విన్ అయ్యాడు. ఈ క్రమంలోనే రీసెంట్ గా ‘క్రాస్ వర్డ్ స్క్రాచ్’ గేమ్ ఆడి భారీ మొత్తంలో ఫ్రైజ్ మనీ పొందాడు. ఏకంగా 2.5 లక్షల డాలర్లు సొంతం చేసుకున్నాడు. అయితే తాను గెలుచుకున్నదాంతో ఆయన కులాసాగా ఎంజాయ్ చేస్తాడనుకుంటే పొరపాటే. గెలుచుకున్న డబ్బంతా సామాజిక కార్యక్రమాలకు ఉపయోగిస్తుంటాడు. తన రాష్ట్రంలోని పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో సౌకర్యాల ఏర్పాటుకు సాయం చేస్తాడు. అసలతను లాటరీల్లో పాల్గొనేదే.. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లోని వసతులను మెరుగుపరచడం కోసం అంటున్నాడు బ్రియాన్.

- Advertisement -

Latest news

Related news