29.3 C
Hyderabad
Monday, March 1, 2021

సమాధి నుంచి శవాన్ని తీసి సంవత్సరీకం.. అక్కడ అదే ఆచారం

మనిషి చనిపోయాక రకరకాల ఆచారాల ప్రకారం అంతిమ సంస్కారాలు జరుపుతారు. ఆ తర్వాత ఏటా సంవత్సరీకం జరిపే సంప్రదాయాలు మనం చూస్తున్నవే. సమాధి మీద పువ్వులు వేయడం, చనిపోయిన వారి ఫోటోకు దండలు వేసి సంవత్సరీకాలు చేయడం మనకు తెలిసిందే. కానీ ఏకంగా పాతిపెట్టిన శవాన్ని తీసి సంవత్సరీకం చేసే ఆచారం గురించి విన్నారా..  అయితే ఇంకేందుకాలస్యం చదివేయండి.

ఇండోనేషియాలోని రిందిగాల్లో అనే గ్రామంలో జరిగే సంవత్సరీకాలను చూస్తే షాక్ అవుతారు. ఆ గ్రామ ప్రజల నమ్మకాలు, విశ్వాశాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. చనిపోయిన వారిపై ఆ గ్రామస్థులు చూపే ప్రేమ, గౌరవం ప్రదర్శించే విధానం వింతగా ఉంటుంది. చనిపోయిన వారిని సమాధి చేయడం అక్కడ ఆచారం. ఏటా సంవత్సరీకం చేస్తారు. ఆ సమయంలో పాతిపెట్టిన శవాన్ని తీసి వాటిని కెమికల్స్ తో శుభ్రం చేస్తారు. తర్వాత వారు బతికినప్పుడు ఎలా బట్టలు వేసుకునేవారో అలాగే శవాలను రెడీ చేసి ఇండ్లకు తీసుకొస్తరు. ఇంట్లో వారు ఎక్కడ కూర్చునేవారో అదే ప్లేస్ లో కూర్చోబెడతారు. శవం ఎదురుగానే కుటుంబ సభ్యులందరూ భోజనాలు కానిచ్చేస్తారు. ఆ రోజంతా వారు పండగలా సంబరాలు చేసుకుంటారు. ఇక సాయంత్రం అవ్వగానే కుటుంబ సభ్యులు విషాధంతో శవాలను తిరిగి స్మశానాలకు చేర్చుతారు. యథాతథంగా సమాధిలో పెట్టి భద్రంగా పూడ్చివేస్తారు. ఆ రాత్రంతా చనిపోయిన వారిని స్మరించుకుంటూ జాగరణ చేస్తారు.

- Advertisement -

Latest news

Related news