నకిలీ టీవీ రేటింగ్స్ స్కామ్‌లో రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ ఆర్నాబ్ గోస్వామికి తిప్పలు తప్పడం లేదు. తాజాగా ఆర్నాబ్ మరిన్ని చిక్కుల్లో పడ్డాడు. గత మూడేళ్లలో ఆర్బాబ్ తనకు మొత్తం రూ.40 లక్షలు ఇచ్చినట్లు బార్క్ మాజీ సీఈవో పార్థో దాస్ గుప్తా ముంబై పోలీసులకు చెప్పేశాడు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన లేఖ రాశాడు. ఆ లేఖలో తాను రెండుసార్లు హాలిడేస్‌కు వెళ్లడానికి 12 వేల డాలర్లు ఆర్నాబ్ ఇచ్చినట్టు గుప్తా చెప్పారు.
తన న్యూస్ ఛానెల్‌కు అనుకూలంగా రేటింగ్స్‌ను తారుమారు చేయడానికే ఆర్నాబ్ తనకు డబ్బులు ఇచ్చినట్టుదాస్ గుప్తా తెలిపారు. ఈ టీఆర్పీ స్కామ్ కేసులో పోలీసులు సప్లిమెంటరీ చార్జ్‌షీట్ దాఖలు చేశారు. మొత్తం చార్జ్‌షీట్ 3600 పేజీలు ఉండటం విశేషం. ఇందులో బార్క్ ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్‌తోపాటు దాస్‌గుప్తా, ఆర్నాబ్ మధ్య జరిగిన వాట్సాప్ చాట్స్, 59 మంది స్టేట్మెంట్లు కూడా ఉన్నాయి.