29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

కోవిడ్19 సోకిన గబ్బిలం కుట్టిందన్న చైనా సైంటిస్ట్

కోవిడ్-19 సోకిన గబ్బిలాలు తమను కుట్టినట్లు వూహన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) శాస్త్రవేత్తలు చెప్పారని ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది.


లైవ్ వైరస్‌లపై పరిశోధన చేసే చైనా శాస్త్రవేత్తలు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిబంధనలను పాటించకుండా, గ్లౌవ్స్, మాస్క్‌లు ధరించకుండా ఓ గుహలోకి వెళ్లినట్టు, అప్పుడే ఒక గబ్బిలం సైంటిస్ట్ ను కుట్టినట్టు శాస్త్రవేత్తలు చెప్పారని ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది.


చైనాలోని వూహన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ శాస్త్రవేత్తలు గతంలో పరిశోధనలో భాగంగా.. ఓ గుహలో గబ్బిలాల నమూనాలను సేకరించారు. అప్పుడే ఓ గబ్బిలం తనకు గుచ్చుకుందని చెప్పారు. ఈ సంఘటన 2017లో జరిగిందని ఆ శాస్త్రవేత్త చెప్పినట్టు ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది. దానికి సంబంధించిన సీసీటీవీ స్క్రీన్ షాట్ లు కూడా వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం డబ్ల్యూహెచ్ఓ బృందం వూహన్‌కు వెళ్లి కోవిడ్-19కు మూలమైన ప్రాంతాన్ని పరిశీలిస్తుంది. ఇప్పుడు ఈ సంగతి తెలిసిన తర్వాత బృందం మరింత క్షుణ్ణంగా పరిశీలించే అవకాశాలున్నాయి.

- Advertisement -

Latest news

Related news