కాంబోడియా దేశంలో ఒక్కసారిగా లాక్డౌన్ ఎత్తేయడతో అక్కడి యూత్ చాలా హుషారుగా ఉంది. యూత్ అంతా డిఫరెంట్‌గా.. బీరు తాగుతూ యోగా చేస్తున్నారు. ఇప్పుడీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాంబోడియా దేశంలో 6 వారాలు లాక్డౌన్ విధించి ఆ తర్వాత సడలించారు. దాంతో కాంబోడియాలోని నామ్ ఫెన్ నగరంలో యువతకు ఒక్కసారిగా రిలీఫ్ దొరకడంతో.. ఏంచేయాలో తోచక బీరుయోగా చేస్తున్నారు. ఒకపక్క అందరితో కలిసి బీరు తాగుతూ, మరోపక్క యోగా కూడా చేస్తున్నారు. ఈ యోగాను ప్రముఖ బీరు తయారీ సంస్థ టూబర్డ్స్ క్రాఫ్ట్ బీర్ బ్రూవరీ ప్రోత్సహిస్తోంది.

బీరుయోగాతో తమకెంతో వినోదం లభిస్తోందని కాంబోడియా యూత్ చెప్తున్నారు. అయితే ఇది నిజమైన యోగా కాదని.. ఫ్రెండ్స్‌తో టైం స్పెండ్ చేయడం లాంటిదేనని.. కాకపోతే యోగాసనాలతో ఫన్ ఎంజాయ్ చేస్తున్నారని అక్కడి యోగా ఇన్స్ట్రక్టర్ అన్నారు
ఆసియాలో చిన్నదేశమైన కాంబోడియా కరోనాను బాగానే ఎదుర్కుంది. అక్కడ 456 కేసులు నమోదవ్వగా.. 399 కోలుకున్నారు. ఒక్కరు కూడా మరణించలేదు.