29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

వైట్ హౌజ్ అంతా మనోళ్లే..

భారతీయులు ఎన్నో ఏళ్లుగా అమెరికాకి ఎంతో సేవ చేస్తున్నారు. ఎన్నో రంగాల్లో రాణిస్తూ.. అమెరికా అభివృద్ధిలో భాగమయ్యారు. అయితే.. అమెరికాలోని భారతీయులకు కొత్త ప్రభుత్వ హయాంలో తగిన గుర్తింపు లభించబోతోంది. అమెరికా కొత్త అధ్యక్షుడు జో బిడెన్ ఏకంగా 20 మంది ఇండియన్-అమెరికన్లను తన పరిపాలనా విభాగంలో నామినేట్ చేశారు. వారిలో 13 మంది మహిళలే. ఈ 20 మందిలో చాలామంది కీలక పదవుల్లో ఉండబోతున్నారు. దాదాపు 17మంది వైట్ హౌస్ కాంప్లెక్స్ పరిధిలో సేవలందిస్తారు.

ఈ నెల 20న అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బిడెన్ ప్రమాణం చేయబోతున్నారు. 2020 ఆగస్ట్ 15న భారత స్వాతంత్య్ర  దినోత్సవ వేడుకల్లో వర్చువల్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న బైడెన్.. తాను గెలిస్తే భారతీయులకు తగిన గుర్తింపు ఇస్తామని మాట ఇచ్చి నిలబెట్టుకున్నారు.

- Advertisement -

Latest news

Related news