32.7 C
Hyderabad
Monday, March 1, 2021

బైడెన్ స్పీచ్ హైలెట్స్ ఇవే..

అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ఆయన ప్రమాణ స్వీకారం జరిగింది. అయితే బైడెన్ ప్రమాణ స్వీకారం కోసం అద్భుతమైన స్పీచ్ ను రాసి అందిచిన భారతీయ-అమెరికన్​ వినయ్ ​రెడ్డి పేరు ఇప్పుడు వరల్డ్ వైడ్ గా పాపులర్ అవుతోంది.

ఈ స్పీచ్ లో బైడెన్​ తన పాలనలో సాధించబోయే లక్ష్యాలు, అమెరికా ఎదుర్కొంటున్న సవాళ్లు, ఐకమత్యం, ప్రజాస్వామ్యం వంటి అంశాల గురించి పవర్ ఫుల్ పదాలతో.. పదునైన వాక్యాలతో అద్భుతమైన స్పీచ్ ను బైడెన్​కు అందించారు వినయ్​.

స్పీచ్ హైలెట్స్ ఇవే
ఈ రోజు చారిత్రకమైన రోజు. అమెరికన్ల రోజు. ప్రజాస్వామ్యానిదీ రోజు. ఈ రోజు జరుపుకుంటున్న విజయోత్సవం అందరిది. ప్రజాస్వామ్యం విలువైంది, సున్నితమైంది. ఐకమత్యం లేకపోతే శాంతి లేదు. అక్కడ కోపతాపాలే మిగులుతాయి. అభివృద్ధి ఉండదు. జాతి ఉండదు.. ఘర్షణలే జరుగుతాయి. దేశం చారిత్రక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇప్పుడు ఐకమత్యంతోనే ముందుకు వెళ్లగలం. అంటూ బైడెన్ స్పీచ్ తో ఆకట్టుకున్నారు. ఇలా వినయ్ రాసిన ప్రతిమాట బైడెన్ నోట తూటాలా పేలింది.

వినయ్ రెడ్డి కరీంనగర్ జిల్లాకు చెందిన నారాయణరెడ్డి కుమారుడు. తండ్రి నారాయణ రెడ్డి 1970లో అమెరికాకి వెళ్ళారు. అక్కడే పుట్టిన వినయ్ రెడ్డి అమెరికాలో లా కోర్సు పూర్తి చేశారు. ఆ తర్వాత పలు ప్రభుత్వ సంస్థల్లో కంటెంట్ రైటర్, స్పీచ్ రైటర్ గా పని చేశారు.

- Advertisement -

Latest news

Related news