29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

ఉద్యమానికి శాంతి బహుమతి

గతేడాది అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడిపై జరిగిన పోలిస్ దాడికి వ్యతిరేకంగా బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనే ఉద్యమం జరిగిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఆ ఉద్యమం ఎంతోమందిని కదిలించింది. మన దేశంలో కూడా నలుపు మీద చర్చ జరిగింది. అంత ఎఫెక్టివ్ గా జరిగిన ఆ ఉద్యమం ఇప్పుడు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయింది.
అమెరికాలో తామూ భాగస్వాములమే అంటూ నల్ల జాతీయులు ఈ ఉద్యమాన్ని చేపట్టారు. జాతి వివక్షను ఖండిస్తూ అమెరికన్లంతా ఏకమయ్యారు. అయితే.. ఈ ఉద్యమంలో భాగంగా అక్కడక్కడా హింసకు పాల్పడ్డారు. ప్రభుత్వ ఆస్తుల్ని, విగ్రహాల్ని నాశనం చేశారు. అయినప్పటికీ ఈ ఉద్యమం శాంతి బహుమతికి నామినేట్ అవ్వడం ఇక్కడ విశేషం. అయితే ఈ ఉద్యమాన్ని మానవతా కోణంలో చూస్తున్నామనీ… జాతి వివక్షను అందరూ ఖండించాలనీ, ప్రపంచమంతా కలిసి రావాలనే ఉద్దేశంతోనే తాము ఈ ఉద్యమాన్ని నామినేట్ చేస్తున్నట్టు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చే నార్వే ప్రభుత్వం తెలిపింది. ఉద్యమానికి మద్దతుగా జరిగిన ఆందోళనల్లో చాలా వరకూ శాంతియుతంగానే జరిగాయని వాళ్లు అభిప్రాయపడ్డారు.

- Advertisement -

Latest news

Related news