29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

రైతుల ఉద్యమంపై బాలీవుడ్ సెలబ్రిటీల ట్వీట్లు.. ఆడుకుంటున్న నెటిజనులు

రైతుల ఉద్యమంపై బాలీవుడ్ సెలబ్రిటీల ట్వీట్లు.. ఆడుకుంటున్న నెటిజనులురైతుల ఉద్యమానికి అంతర్జాతీయ స్థాయిలో పలువురు సెలబ్రిటీలు రైతుల ఉద్యమానికి మద్దతు తెలపడంతో అన్నదాతల ఆందోళన మరోసారి ఇంటర్నేషనల్ లెవల్లో చర్చనీయాంశమైంది. రైతుల ఉద్యమానికి సపోర్ట్ చేస్తూ రిహన్నా, గ్రెటా థన్ బర్గ్, మీనా హ్యారీస్ చేసిన ట్వీట్లు ఇంటర్నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు రైతు ఉద్యమానికి పెట్టిన ట్వీట్లను టార్గెట్ చేస్తూ బాలీవుడ్ సెలబ్రిటీలు కంగనా రనౌత్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, ఏక్తా కపూర్, క్రికెటర్ సచిన్ టెండుల్కర్ మాత్రం ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ట్వీట్లు చేశారు. దేశంలోని సమస్యల పట్ల మీరు స్పందించాల్సిన అవసరం లేదంటూ.. ఇండియా టు గెదర్ అంటూ ట్వీట్లు చేశారు.
దేశ రాజధానిలో దాదాపు రెండు నెలలుగా రైతులు ఉద్యమం చేస్తుంటే.. వారికి మద్దతుగా ఒక్కరోజు కూడా మాట్లాడని బాలీవుడ్, క్రికెట్ సెలబ్రిటీలు ఇప్పుడు ట్వీట్లు చేయడం పట్ల నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులపై లాఠీచార్జీలు, టియర్ గ్యాస్ ప్రయోగించినప్పుడు స్పందించని సెలబ్రిటీలకు.. ఇప్పుడు ఇండియా టు గెదర్ అనే మాట గుర్తొచ్చిందా అంటూ ప్రశ్నిస్తున్నారు. రైతులు ఢిల్లీలో ప్రవేశించకుండా రోడ్డుకు అడ్డంగా భారీ బారికేడ్లు, ముళ్లకంచెలు, ఇనుప చువ్వలు కనిపించలేదా? అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇన్నిరోజుల రైతు ఉద్యమం గురించి ఒక్క పోస్ట్ కూడా పెట్టనివారు.. ఇప్పుడు బీజేపీ ఐటీ సెల్ నుంచి ఆదేశాలు రాగానే.. రైతులది ఉద్యమమే కాదు.. ప్రభుత్వానికి మద్దతు తెలుపుదాం, దేశ సమగ్రత వంటి అంశాలు గుర్తొస్తున్నాయా? అంటూ దుమ్ము దులిపేస్తున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీలు పెట్టిన ట్వీట్లు పోస్ట్ చేస్తూ.. ట్రోల్ చేస్తున్నారు. మేమంతా రైతుల పక్షం.. మీరు ఎవరి పక్షమో తేల్చుకోండి.. అంటూ సవాల్ విసురుతున్నారు. బాధితుల పక్షాన నిలిచి.. వారికి మద్దతు పలికినందుకు రిహన్నా, గ్రెటాలకు నోటీసులు పంపించడం పట్ల నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Latest news

Related news