29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

రైతుల ట్రాక్టర్ మార్చ్ సక్సెస్.. అమిత్ షా అర్జెంట్ సమావేశం

దేశ రాజధాని ఢిల్లీలో రైతుల ఆందోళన హింసాత్మకంగా మారడంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఢిల్లీలో అదనంగా 15 కంపెనీల పారామిలిటరీ బలగాలను మోహరించాలని నిర్ణయించారు. రైతులు నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అత్యవసరంగా భేటీ అయింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వలో హోం శాఖ, నిఘా విభాగ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈరోజు ఢిల్లీలో జరిగిన పరిణామాలపై సమీక్ష జరిపారు.

 ఢిల్లీలో రైతులు ఎర్రకోటపైకి ఎక్కి జెండా ఎగురవేయడం, విజయవంతంగా ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించడం, కొన్నిచోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం వంటి అంశాలపై సమీక్ష జరిపారు. రైతుల ఆందోళన హింసాత్మకంగా మారడంతో పార్లమెంట్, రాష్ట్రపతి భవన్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేసి.. ఇంటర్‌నెట్ సేవలను నిలిపివేశారు. మరోవైపు తమ ఆందోళనలోకి అసాంఘిక శక్తులు చొరబడ్డాయని రైతు సంఘాల ఐక్యవేదిక నాయకుడు రాకేశ్ తికాయత్ ఆరోపించారు.

- Advertisement -

Latest news

Related news