18.7 C
Hyderabad
Thursday, January 21, 2021

అత్యంత ఆస్తిపరుల జాబితాలో ముఖేష్ అంబానీ ఇకపై నెంబర్ వన్ కాదు. ఆయనను ఆయ‌న‌ను దాటేసి ఓ చైనా కుబేరుడు ఆస్తులు కూడబెటాడు. కేవ‌లం ఒకే ఒక్క ఏడాదిలో  ఆ కుబేరుడు ఈ ఘ‌న‌త సాధించ‌డం ఆశ్చర్యపరిచే విషయం. ఇంతకీ ఆయన పేరు చెప్పలేదు కదా. ఝాంగ్ షాన్షాన్‌. చైనాకు చెందిన ఈయ‌న స‌క్సెస్ స్టోరీ చాలా మందిని ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. 

ఒక్క ఏడాదిలోనే..

2020 సంవత్సరం పేరు చెప్తే అందరికీ టక్కున గుర్తొచ్చేది కరోనా. అయితే.. కరోనా తన పని తాను చేసుకుంటూ పోతుంటే.. ఝాంగ్ కూడా తన పని తాను చేసుకుంటూ పోయాడు. కేవలం 2020లోనే 7090 కోట్ల డాల‌ర్లు సంపాదించాడు. దీంతో ఆయ‌న మొత్తం ఆస్తుల విలువ 7780 కోట్ల డాల‌ర్లకు చేరింది. ప్రస్తుతం ప్రపంచ సంప‌న్నుల జాబితాలో ఝాంగ్ 11వ స్థానంలో ఉన్నాడు. ఝాంగ్ సంపాదన చరిత్రలో నిలిచిపోతుందని బ్లూమ్ బర్గ్ పత్రిక అభివ‌ర్ణించింది. అయితే.. 2020 కంటే ముందు ఈయన పేరు చైనాలో ఎవరికీ తెలియ‌దు. ఒకే ఒక్క ఏడాదిలో ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకొన్నాడు ఝాంగ్‌.  ఈయనకు రాజ‌కీయాల‌తో సంబంధం లేదు. సంప‌న్నుల కుటుంబాల‌తో వ్యాపార సంబంధాలు కూడా లేవు. ఒంటరిగా స్వశక్తితో ఎదిగాడు. అందుకే చైనాలో  ఝాంగ్ ను  లోన్ వోల్ఫ్‌ అంటారు.

జర్నలిస్టుగా మొదలై..

ఝాంగ్ సంపాదనలాగే.. ఆయన కెరీర్ కూడా చాలా చిత్రంగా సాగింది. ఆయ‌న వివిధ రంగాల్లో అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నాడు. జ‌ర్నలిజం, మ‌ష్రూమ్ సాగు, హెల్త్ కేర్‌.. ఇలా ఒక్కో రంగంలో అడుగుపెట్టి.. ఏకంగా ఆసియాలోనే అత్యంత సంప‌న్నుడిగా ఎదిగారు. అయితే ఈ స‌క్సెస్‌కు ఆయ‌న రెండు కార‌ణాలు చెబుతున్నారు. ఒక‌టి.. ఏప్రిల్‌లో వ్యాక్సిన్ త‌యారు చేసే సంస్థ బీజింగ్ వాంటాయ్ బ‌యోలాజిక‌ల్ ఫార్మసీ ఎంట‌ర్‌ప్రైజెస్‌ను కొనుగోలు చేయడం.. ఇక రెండోది కొన్ని నెల‌ల త‌ర్వాత వాటర్ బాటిల్స్ త‌యారు చేసే సంస్థ నాంగ్‌ఫు కంపెనీని వ‌శం చేసుకోవ‌డం. వీటిలో వాంటాయ్ షేర్లు ఏకంగా 2000 శాతం పెర‌గ‌గా.. నాంగ్‌ఫు షేర్లు 155 శాతం పెరిగాయి. ఈ రెండు కొనుగోళ్లే ఝాంగ్ జీవితాన్ని మ‌లుపు తిప్పాయి. ఒకే ఒక్క ఏడాదిలో ఆయ‌న‌ను ఆసియాలోనే అత్యంత సంప‌న్నుడిగా మార్చాయి. 

అంబానీ వెనక్కి నెట్టేసి మరీ..

మ‌రోవైపు 2020లో భార‌త కుబేరుడు ముకేశ్ అంబానీ సంప‌ద కూడా భారీగానే పెరిగింది. రిల‌యెన్స్ ఇండ‌స్ట్రీస్ ఈ ఏడాది భారీ పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించ‌డంతో ఆయ‌న సంప‌ద 1830 కోట్ల డాల‌ర్లు పెరిగి 7690 కోట్ల డాల‌ర్లకు చేరింది. ఇక అంబానీ కంటే ముందు ఆసియా రిచెస్ట్ ప‌ర్సన్‌గా ఉన్న చైనా కుబేరుడు జాక్ మా సంప‌ద ప్రస్తుతం 5120 కోట్ల డాల‌ర్లుగా ఉంది. ఆయ‌న సంప‌ద గ‌త అక్టోబ‌ర్‌లో 6170 కోట్ల డాల‌ర్లు కాగా.. రెండు నెల‌ల్లోనే భారీగా నష్టాల్ని చవిచూశారు.

- Advertisement -

Latest news

Related news

కొత్త సాగు చట్టాలు.. 18 నెలలపాటు అమలు వాయిదా

కొత్త సాగు చట్టాలకు సంబంధించి రైతు సంఘాల ముందు కేంద్రం కీలక ప్రతిపాదన ఉంచింది. రైతు సంఘాలు లేవనెత్తిన మూడు కీలక చట్టాల అమలును 18 నెలలపాటు నిలిపివేయనున్నట్లు చెప్పింది....

బైడెన్ పట్టాభిషేకానికి బరాక్, క్లింటన్, బుష్

అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ పట్టాబిషేక కార్యక్రమానికి ఆ దేశ మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా- మిచెల్ ఒబామా, బిల్ క్లింటన్- హిల్లరీ క్లింటన్‌,...

బైడెన్ తొలి సంతకం వీటిపైనే..

అమెరికా ప్రెసిడెంట్ గా బైడెన్ మరికొన్ని గంటల్లో బాధ్యతలు తీసుకోనున్నారు. బాధ్యతలు చేపట్టిన మరు క్షణమే గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని వివాదస్పద అంశాలను రద్దు చేస్తూ తొలి సంతకం...

మిషన్ భగీరథ వాటర్ బాటిల్స్ ఆవిష్కరణ

మిషన్ భగీరథ వాటర్ బాటిల్స్ ని మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యదర్శి స్మితా సభర్వాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మినిస్టర్ ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఇంటింటికి...