29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

జాక్ మాకు మరోసారి షాకిచ్చిన చైనా

చైనా బ్యాంకులు, ప్రభుత్వంపై నోరుజారి చిక్కుల్లో పడ్డ చైనా కుబేరుడు, అలీబాబా అధినేత జాక్ మా పై చైనా ప్రభుత్వం కక్ష్య కట్టినట్టు కన్పిస్తోంది. వరుసగా జాక్ మాకు చైనా ప్రభుత్వం షాక్ లు ఇస్తోంది. ఇటీవల కన్పించకుండా పోయిన జాక్ మా ఆ తర్వాత తిరిగి వచ్చాడు. తనకేమీ  కాలేదంటూ స్టేట్ మెంట్లు ఇచ్చాడు. కానీ ఇంటర్నేషనల్ మీడియా మాత్రం చైనా రహస్య అధికారుల చెరలో ఉన్నట్లు కథనాలు రాశాయి.

ఇటీవల తన కంపెనీల వ్యవహారాలపై నిఘా పెట్టాలని ఆ దేశ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా చైనా టెక్ దిగ్గజాల జాబితా నుంచి జాక్ మాను తొలగించింది. ఈ మేరకు చైనా అధికారిక మీడియా సంస్థ జిన్హువా న్యూస్ ఏజెన్సీకి చెందిన షాంఘై సెక్యూరిటీస్ న్యూస్ మంగళవారం రాసుకొచ్చింది. చైనా దేశ టెక్ దిగ్గజాల గురించి రాసిన ఓ కథనంలో జాక్ మా పేరును ప్రస్తావించలేదు.

ఇదే సమయంలో జాక్ మా ప్రత్యర్థిగా ఉన్న టెన్సెంట్ సీఈవోపై ప్రశంసలు కురిపించడం గమనార్హం. ఇదే కథనంలో చైనా టెక్ దిగ్గజాల జాబితాలో బీవైడీ కో చైర్మన్ వాంగ్ చువాన్‌, షావోమీ సహ వ్యవస్థాపకుడు లీ జున్, హువావే అధినేత రెన్ జెంగ్ ఫెయ్ తదితర పేర్లను ప్రస్తావించారు. జాక్ మాపై చైనా వరుస దాడుల నేపథ్యంలో ఆయన ప్రత్యర్థి కంపెనీలైన టెన్సెంట్, వీ-చాట్ స్టాక్స్ మంగళవారం దాదాపు రెండు శాతం పెరిగడం విశేషం.

- Advertisement -

Latest news

Related news