అమెరికాను కరోనా మహమ్మారి ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. వాతావరణంలో అనూహ్యంగా వచ్చిన మార్పులతో న్యూయార్క్, కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్, టెక్సాస్, కొలరాడో, ఇదాహో, ఇండియానా, మైనే, మిచిగాన్, మిన్నెసోటా, రోడ్ ఐలాండ్, వాషింగ్టన్, విస్కాన్సిన్ రాష్ట్రాలలో వైరస్ వ్యాప్తి పెరిగినట్టు జాన్స్ హాప్కిన్స్ యునివర్సిటీ ప్రకటించింది.
నిన్న ఒక్కరోజే 3900మంది మృతి చెందినట్టు వెల్లడించిన జాన్స్ హాప్కిన్స్ .. మొత్తం మరణాల సంఖ్య 3లక్షల 65వేల 620కి చేరినట్టు పేర్కొంది. దేశంలో బాధితుల సంఖ్య 2కోట్ల 15లక్షల79వేలకు చేరువైందని.. యాక్టీవ్ కేసుల సంఖ్య 83లక్షల 51వేలగా ఉందని తెలిపింది. ఇటు దక్షిణ డకోటా, అయోవా, మరియు వ్యోమింగ్ వంటి రాష్ట్రాల్లో కరోనా తిరిగి విజృంభిస్తోంది.