ఐస్‌క్రీమ్ డబ్బాలలో కరోనా వైరస్ బయటపడ్డ సంఘటన చైనాలో చోటుచేసుకుంది. టియాంజిన్ మునిసిపాలిటీలో డాకియాడో ఫుడ్ కంపెనీకి చెందిన 4,836 ఐస్‌క్రీమ్ డబ్బాలలలో కరోనా వైరస్‌ను గుర్తించారు. 1,812 బాక్సులను ఇప్పటికే అమ్మగా.. మిగతావాటిని అధికారులు సీజ్ చేశారు. ఐస్‌క్రీమ్ బాక్సుల్లోకి కరోనా వైరస్ మనుషుల ద్వారానే ప్రవేశించిందని యూనివర్శిటీ ఆఫ్ లీడ్స్ వైరాలజిస్ట్ డాక్టర్ స్టీఫన్ గ్రాఫిన్ చెప్పారు. ఐస్‌క్రీమ్ అనేది ఫ్యాట్‌తో తయారవుతుందని, దానిని కోల్డ్ స్టోరేజ్‌లో నిల్వచేయడం కారణంగా అక్కడ వైరస్ వేగంగా వృద్ధి చెందుతుందన్నారు.
తాము ఉత్పత్తిచేసిన ఐస్‌క్రీమ్‌ల్లో కరోనా వైరస్ నిర్ధారణ అయినట్టు డాకియాడో ధ్రువీకరించింది. ప్లాంట్‌లో పనిచేసే మొత్తం 1,662 ఉద్యోగులను క్యారంటైన్లో ఉంచి న్యూక్లియక్ యాసిడ్ పరీక్షలు నిర్వహించామని చెప్పింది. వీరిలో 700 మందికి నెగెటివ్ వచ్చిందని, ఇంకా 962 మంది ఫలితాల నివేదికలు రావాల్సి ఉందన్నారు.