కరోనావైరస్ చైనా ల్యాబ్‌లలో పుట్టలేదని.. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO) పేర్కొంది. కరోనా మూలాలను శోధించేందుకు వూహాన్ వెళ్లిన డబ్ల్యూహెచ్ఓ ఎక్స్పర్ట్ టీం కొన్ని కొత్త విషయాలు వెల్లడించింది.
వూహాన్ వెళ్లిన డబ్ల్యూహెచ్ఓ టీం.. వూహాన్ లోని సీ ఫుడ్ మార్కెట్ సహా అనేక ప్రాంతాల్లో సెర్చింగ్ చేసింది. అయితే అక్కడి రీసెర్చ్ ను బట్టి.. కరోనా వైరస్.. వైరాలజీ ల్యాబ్ నుంచి లీకై, మానవుల్లోకి వ్యాపించి ఉండటానికి ఆస్కారం లేదని.. గబ్బిలం నుంచి అలుగు అనే మరో జంతువులోకి ప్రవేశించి ఉంటుందని. దాని నుంచి మానవుల్లోకి వ్యాపించి ఉండొచ్చని తమ రీసెర్చ్ లో వెల్లడైందని పేర్కొన్నారు.
