వాషింగ్టన్ లో అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ ప్రమాస్వీకారోత్సవానికి భద్రత కల్పించేందుకు వచ్చిన వారిలో 200మంది నేషనల్ గార్డులకు కరోనా పాజిటివ్ గా తేలింది.
ప్రమాణ స్వీకారానికి వాషింగ్టన్ నగరంలో కఠినమైన భద్రతా చర్యలను చేపట్టిన విషయం తెలిసిందే.. అందులో భాగంగానే నేషనల్ గార్డ్స్.. రేజర్ వైర్‌తో కంచెలు ఏర్పాటు చేసి, చెక్ పాయింట్లలో భారీగా మోహరించారు. అయితే వీళ్లలో 200 మంది గార్డులకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఇంకా సిటీలో 25 వేల మందికి పైగా భద్రతా దళాలు సిటీలో మోహరించారు. వారికి కూడా టెస్టులు జరుగుతున్నాయి.
