చలి దెబ్బకు చేతులు వంకర్లు పోవడం.. వణుకు పుట్టడం మనకు తెలిసిందే. కశ్మీర్ లో చలి ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది చలి గతేడాది కంటే ఎక్కువ ఉంది. చలిపంజాకు కాశ్మీరులోని దాల్ సరస్సు గడ్డ కట్టిపోయింది.


ఉష్ణోగ్రత సున్నాకు పడిపోయి.. సరస్సులోని నీరు గడ్డకట్టింది. ఇప్పటి వరకు నమోదైన వాతావరణ వివరాల ప్రకారం కనిష్ఠ ఉష్ణోగ్రత 0 డిగ్రీలకు పడిపోగా.. గరిష్ట ఉష్ణోగ్రత 6 డిగ్రీలుగా నమోదనట్టు అధికారులు తెలిపారు.