25.6 C
Hyderabad
Friday, January 15, 2021

‘స్నానం చేయడం అంత అవసరమా?’ ఐదేళ్లుగా స్నానం మానేసిన డాక్టర్

‘మన జీవితంలో రెండు సంవత్సరాల సమయం కేవలం స్నానం చేయడానికి సరిపోతుంది. అంత టైం వేస్ట్ చేయడం అవసరమా? పైగా ఎంత వాటర్ వేస్ట్ అవుతుంది. అసలీ విషయాన్ని ఎప్పుడైనా గమనించారా?’ అని ప్రశ్నిస్తున్నాడు ఒక డాక్టర్.. ఆయన అసలు స్నానమే చేయడట. ఆ కథేంటో చూద్దామా..


డాక్టర్ జేమ్స్ హ్యాంబ్లిన్ న్యూయార్క్‌కు చెందిన డాక్టర్, రైటర్. యేల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రొఫెసర్‌గా కూడా పని చేస్తున్నారు. ఈ డాక్టర్ ఐదేళ్లనుంచి స్నానం చేయటం మానేసాడట.
దానివల్ల నాకు ఎటువంటి ఇబ్బందీ అనిపించలేదని , స్నానం చేయకుండా ఉంటే మీకు కూడా అలవాటైపోతుందని, స్నానం అనేది అంత ముఖ్యమైన విషయం కాదని ఆయన అంటున్నారు. అంతేకాదు “ప్రతిరోజూ స్నానం చేయడం అవసరమా? స్నానం చేశాక మళ్లీ బాడీ స్ప్రేలు, క్రీములు పూసుకొని ఉపయోగం ఏముంది? అసలు స్నానమే చేయకుండా ఉండలేమా?” అంటున్నారు. ఆయన రాసిన “క్లీన్: ది న్యూ సైన్స్ ఆఫ్ స్కిన్ అండ్ ది బ్యూటీ ఆఫ్ డూయింగ్ లెస్” అనే పుస్తకంలో స్నానం గురించి, దాని వల్ల అయ్యే వాటర్, టైమ్ వేస్ట్‌ల గురించి డీటెయిల్డ్ గా రాశారు.

సహజంగా ఉంది

డాక్టర్ జేమ్స్ హ్యాంబ్లిన్ 2015 నుంచి స్నానం చేయడం ఆపేసారట. “స్నానం చేయడం ఆపేసిన తర్వాత నాకు ఏమీ చికాకుగా అనిపించలేదు. అలా వారాలు గడుస్తున్న కొద్దీ నా శరీరం స్నానం చేయకుండా ఉండటానికి అలవాటు పడిపోయింది. కొన్ని రోజుల తర్వాత నా శరీరం నుంచి ఎటువంటి దుర్వాసనా రాలేదు. చర్మం జిడ్డుగా కూడా లేదు. స్నానం చేయడం మానేయడం వల్ల శరీరం సహజ స్థితికి వచ్చి వాసనలు రాకుండా సహజంగా ఉంటుంది. ఓ మనిషి దగ్గర ఎలాంటి వాసన వస్తుందో అదే వాసన వస్తుంది. అయితే అది దర్గంధం మాత్రం కాదు. స్నానం మానేసిన దగ్గర నుంచి నా దగ్గర వచ్చే కొత్త వాసనను నా భార్య కూడా ఇష్టపడింది” అని చెప్పుకొచ్చారాయన.


చిన్న వయసులోనే..

నీటి వృథాను, టైం వేస్ట్‌ను తగ్గించుకోవాలంటే స్నానం మానేయడం బెస్ట్ అంటున్నారు డాక్టర్. అయితే ఒక్కసారిగా మానేయకుండా మెల్లగా తగ్గిస్తూ ఉండాలట. అయితే చేతులు కడుక్కోవడం, పళ్లు తోముకోవడం మాత్రం మానకూడదని ఆయన అన్నారు.
డాక్టర్ జేమ్స్ హ్యాంబ్లిన్ చిన్న వయస్సులో డాక్డర్‌గా ప్రజారోగ్యం, నివారణ వైద్యంలో ప్రత్యేకత కలిగిన బోర్డు సర్టిఫికేట్ పొందారు. పలు యూఎస్ మీడియాల్లో ఎడిటర్, రైటర్‌గా పనిచేశారు.

- Advertisement -

Latest news

Related news

స‌మ్మర్ స్పెష‌ల్‌గా రానున్న నార‌ప్ప ‌

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్ననారప్ప సినిమా సమ్మర్ లో తెలుగు ప్రేక్షకులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నది. వెరైటీ పాత్రలు ఎంచుకొని.. ప్రయోగాలు చేయడంలో ముందుండే విక్టరీ వెంకటేశ్, ప్రియమణిలు జోడీగా...

అందరూ కలిసి ఊరికి బర్త్ డే చేశిర్రు

ఇదేం విచిత్రం.. ఎవరైనా మనుషులకు బర్త్ డే చేస్తరు. పైసలున్నోళ్లయితే.. పెంచుకునే కుక్కపిల్లలకు, పిల్లి పిల్లలకు బర్త్ డేలు చేస్తరు. కానీ.. ఊరికి బర్త్ డే చేసుడేంది అని ఆలోచిస్తున్నరా?...

రియల్ హీరో సోనూసూద్ మ్యూజిక్ వీడియో చూశారా..

రియల్ హీరో సోనూసూద్.. తొలిసారిగా ఓ మ్యూజిక్ వీడియో ‘పాగ‌ల్ న‌హీ హోనా’లో నటించాడు. ఆర్మీ ఆఫీసర్ గా కన్పించిన ఆ మ్యూజిక్ వీడియో రీల్ హీరోగా కన్పించి తన...

పాక్ కెప్టెన్ బాబర్ మీద లైంగిక వేధింపుల కేసు నమోదు

పాకిస్తాన్‌ క్రికెట్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్ చిక్కుల్లో పడ్డారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ యువతిని మోసం చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో లాహోర్‌ అదనపు సెషన్స్‌ కోర్టు...