18.1 C
Hyderabad
Thursday, February 25, 2021

రెండు మాస్క్‌లుంటేనే అక్కడ సేఫ్

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్, వైస్ ప్రెసిడెంట్‌గా కమలా హ్యారిస్ ఇటీవల ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ వేడుకలో వాళ్లిద్దరితో పాటు అక్కడున్న చాలామంది ఆఫీసర్లు రెండు ఫేస్ మాస్క్‌లు ధరించారు. ఇది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
కొవిడ్ సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి ముఖానికి రెండు మాస్క్‌లు పెట్టుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నా ఎవరు అంతగా పట్టించుకోలేదు. కానీ, అమెరికా ప్రెసిడెంట్ సెర్మనీ తర్వాత నుంచి డబుల్ మాస్కింగ్ టాపక్ ట్రెండ్ అవుతోంది.


ప్రపంచవ్యాప్తంగా కరోనా స్ట్రెయిన్ వ్యాప్తి చెందుతుండటంతో రెండు ఫేస్ మాస్క్‌లు ధరించాలని హెల్త్ ఎక్స్ పర్ట్స్ అభిప్రాయపడ్డారు.ముందుగా సర్జికల్ మాస్క్ ధరించి, దానిపై నాణ్యత కలిగిన ఫ్యాబ్రిక్ మాస్క్ ధరించడం బెటర్ అంటున్నారు. వైరస్ కణాలు ఒక మాస్క్ దాటి లోపలికి వచ్చినా, రెండో మాస్క్ దగ్గర ఆగిపోతాయంటున్నారు. డబుల్ మాస్కింగ్ వల్ల 50-75 % వరకు వైరస్ నుంచి మనకు రక్షణ లభిస్తుందని కొన్ని అధ్యయనాలు కూడా చెప్తున్నాయి.


అయితే రెండు మాస్క్ ల వరకూ ఓకే. కానీ అంతకంటే ఎక్కువ మాస్క్‌లు ధరించడం మాత్రం అంత సేఫ్ కాదని, దానివల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. ప్రస్తుతం బైడెన్ ప్రభుత్వం మాస్క్ పెట్టుకోవడం తప్పనిసరి చేయడంతో పాటు, అమెరికన్స్ కు 100 డేస్ మాస్కింగ్ చాలెంజ్ విసిరారు. దీంతో డబుల్ మాస్కింగ్ ట్రెండ్ అవుతోంది.

- Advertisement -

Latest news

Related news