భూమి తన చుట్టు తాను తిరగే వేగం పెరిగింది. దాంతో రోజుకు 24 గంటలు(86,400 సెకన్లు) ఉండాల్సిన చోట తగ్గుతూ వస్తోంది. మొత్తంగా ఏడాదికి లెక్కిస్తే… రోజుకు అరక్షణం(19 మిల్లీ సెకన్లు)గా చెప్పవచ్చు. ఇలా 2020లో సగటున రోజుకు 0.05 మిల్లీ సెకన్ల సమయం తగ్గడంతో గతేడాదిలో 28 రోజులు తొందరగా గడిచిపోయిందట. గత 50ఏళ్లలో ఇదే రికార్డు అని సైంటిస్టులు తేల్చారు. గతంలో భూమి వేగం తగ్గిన సందర్భాల్లో 28 సార్లు ఒక లీప్ సెకన్ను కలిపారు. ఇప్పుడు ఆ ఒక లీప్ సెకన్ను టైం నుంచి తొలగించాలని సైంటిస్టులు భావిస్తున్నారు.
వేగం ఎందుకు పెరుగుతుంది?
వాతావరణ పీడనం, గాలి ప్రభావం, మహాసముద్రాల మట్టం స్థాయిలు, భూకేంద్రకం కదలికల వల్ల భూమి వేగంలో హెచ్చుతగ్గులు వస్తాయని సైంటిస్టులు చెబుతున్నారు. 2020లో జులై 19న రోజు తొందరగా గడిచిపోయిందట. రికార్డ్ స్థాయిలో 1.4602 మిల్లీ సెకన్ల టైం తగ్గింది. కొన్ని డేటా లాగింగ్ అప్లికేషన్లు, టెలికమ్యూనికేషన్స్, ఇన్ ఫ్రా స్ట్రక్చర్ వంటి పలు సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీలపై భూమి వేగం, టైం జోన్ల ప్రభావం అధికంగా ఉంటుంది.
భూమి వేగాన్ని ఎలా లెక్కిస్తరు
ఇంటర్నేషనల్ ఎర్త్ రొటేషన్ అండ్ రిఫరెన్స్ సిస్టమ్స్ సర్వీసు (IERS) ఒక రోజులో భూమి వేగాన్ని అధికారికంగా లెక్కిస్తుంది. సోలర్ టైం ప్రకారం.. యూనివర్శల్ టైం (UTI)గా సూచిస్తారు. అంతర్జాతీయ ఆటోమిక్ టైమ్ (TAI)తో ఈ UTI ని పోలిస్తే.. భూమి వేగం టైం స్కేల్ తెలుసుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ ల్యాబరేటరీల్లో అమర్చిన 200 ఆటోమిక్ క్లాకులతో TAIని లెక్కిస్తారు.