29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

ఇండోనేషియాలో మరోసారి భూ ప్రకంపనలు

రిక్టర్ స్కేలుపై 6.2 గా నమోదు

ఇండోనేషియాలో మరోసారి భూ కంపం వచ్చింది. భూ కంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2 గా నమోదైంది. సులావేసి దీవుల్లో మజేన్‌ నగర సమీపంలో 10 కిలోమీటర్ల లోతులో భూ ప్రకంపనలు వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. దీని ప్రభావంతో పలు భవనాలు నేలమట్టం కాగా.. ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. శిథిలాల కింద చిక్కుకున్న వందలాది మందిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు ప్రకటించారు. 2018లో సులవేసిలో సంభవించిన భూకంపం వల్ల వచ్చిన సునామీ వల్ల వేలాదిమంది మరణించారు.

- Advertisement -

Latest news

Related news