29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

వైరల్ అవుతున్న​ ఎలన్‌ మస్క్‌ చాలెంజ్‌

పెరిగిన జనాభా, అడ్వాన్స్డ్ టెక్నాలజీ వల్ల లాభమేమోగానీ నష్టమే ఎక్కువ ఉందని అర్థమవుతుంది. పచ్చగా ఉండాల్సిన భూమిపై జీవం ఎండిపోతుంది. వాతావరణంలో ఎన్నెన్నో మార్పులొస్తున్నాయి. ప్రస్తుతం మన ఎన్విరాన్‌మెంట్‌కు ఉన్న పెద్ద ముప్పు కార్బన్ ఎమిషన్స్, గ్లోబర్ వార్మింగ్.. ఈ రెండింటిని కంట్రోల్ చేసే దిశగా.. టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఓ ఛాలెంజ్ విసురుతున్నారు. దానికి గానూ.. గెలిచిన వారికి ఏకంగా 100 మిలియన్‌ డాలర్ల(730 కోట్లు) భారీ ప్రైజ్‌ మనీ కూడా అనౌన్స్ చేశారు.

ఛాలెంజ్‌ ఇదీ
ఎలన్ మస్క్ తన ట్విట్టర్‌ లో “కర్భన ఉద్గారాలను సంగ్రహించే అత్యుత్తమ టెక్నాలజీని అభివృద్ధి చేసిన వారికి 100 మిలియన్‌ డాలర్ల ప్రైజ్‌ మనీని అందిస్తాను. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వచ్చే వారం ప్రకటిస్తాను” అంటూ ట్వీట్‌ చేశారు.

ఎందుకంటే..
ప్రస్తుతం మార్స్ మీదకు వెళ్లే టెక్నాలజీ కూడా మన దగ్గర ఉంది. కానీ వాతావరణంలోని కార్బన్ ఎమిషన్స్‌ను క్యాప్చర్ చేసి, గ్రహించే టెక్నాలజీ మాత్రం లేదు. ఎందుకంటే దాని వల్ల కమర్షియల్ గా ఎలాంటి ఉపయోగం ఉండకపోవచ్చు. అందుకే అలాంటి ఇన్వెషన్స్‌ను ఎవరూ ఇప్పటివరకూ చేయలేదు.
వాతావరణ మార్పులను అదుపులో ఉంచాలంటే భూమిని వేడేక్కించే ఉద్గారాలను సంగ్రహించాలి. ఉద్గారాలను తగ్గించడంపై దృష్టి పెడితే పర్యావరణం కొంతైనా కోలుకుంటుంది. అందుకే ఎలన్‌ మస్క్‌ ఇలాంటి ఛాలెంజ్‌ను విసిరి కర్బన్ క్యాప్చర్ టెక్నాలజీని కనిపెట్టేందుకు సైంటిస్టుల ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేశారు.

- Advertisement -

Latest news

Related news