32.3 C
Hyderabad
Thursday, February 25, 2021

ఇకపై ఫేస్ బుక్ లో పొలిటికల్ గ్రూపులు బంద్!

రాజకీయాలకు సంబంధించిన గ్రూపులు ఇకపై ఫేస్ బుక్ లో రికమెండ్ చేయకూడదని ఎఫ్బీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఫేస్ బుక్ అధినేత మార్క్ జూకర్ బర్గ్ ప్రకటించారు. ఇప్పటికే అమెరికాలో అమలు చేస్తున్నారు. రాజకీయ గొడవల వల్ల ఫేస్ బుక్ స్థాయి తగ్గిపోతుందన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు జూకర్ తెలిపారు. ఫేస్ బుక్ నుంచి సివిక్, పొలిటికల్ గ్రూపులను రికమండేషన్ల జాబితా నుంచి తొలగించాలని భావిస్తున్నట్లు జూకెర్‌బర్గ్ పేర్కొన్నారు. న్యూస్ ఫీడ్ లో కూడా రాజకీయ కంటెంట్‌ను సాధ్యమైనంత వరకు తగ్గిస్తామని ఆయన చెప్పారు. ఫేస్‌బుక్ యూజర్ల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నారట.
అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ప్రజలను తప్పుదారి పట్టించే మెసేజిలు, హింసాత్మక సందేశాలు వ్యాపించకుండా ఉండేందుకు ఫేస్‌బుక్ చాలా చర్యలు తీసుకుంది. అదే పద్ధతిని మొత్తం ఫేస్ బుక్ లో అమలు చేయాలని ఫిక్సైపోయారు.

- Advertisement -

Latest news

Related news