‘నేను చనిపోయిన తర్వాత నా డెడ్ బాడీని లండన్ జూలోని సింహాలకు ఆహారంగా వేయండి. తన శరీరం కనీసం మరో ప్రాణి ఆకలి తీరుస్తుందన్నందుకు సంతోషం. ’ అని బ్రిటన్‌కు చెందిన కమెడియన్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ రికీ జెర్వీస్ ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో రికీని యాంకర్ ‘మీరు చనిపోయిన తర్వాత మీ శరీరాన్ని ఏమీ చేయాలని కోరుకుంటున్నారు’ అని అడిగిన దానికి రికీ ఇలా స్పందించాడు.
‘స్వేచ్ఛగా తిరిగే జంతువులను మనిషి చంపి తింటున్నాడు. ప్రకృతిని నాశనం చేసి.. అడవులను నరికేస్తున్నాడు. దాంతో పులులు, సింహాలు ఆహారం లేక అలమటిస్తూ.. మరణించడం బాధాకరం.’ అంటూ రికీ తన కోరిక వెనుక ఉన్న అసలు కారణాన్ని యాంకర్ కి వివరించాడు.
రికీ కోరిక సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో లండన్ జూ అధికారులు స్పందించారు. ‘రికీ మీ కోరిక తీర్చలేము. అదే సింహాలకు ఆహారం కొనేందుకు విరాళం ఇవ్వండి చాలు. కరోనా తర్వాత జూ నిర్వహణ చాల కష్టంగా మారింది. ఎవరైనా ఏదైనా ఇవ్వాలంటే విరాళాల రూపంలోనే ఇయ్యండి’ అని లండన్ జూ అఫిషియల్స్ స్పష్టం చేశారు.