33.9 C
Hyderabad
Saturday, March 6, 2021

తన హోటల్‌కు తానే బ్యాడ్ రివ్యూ

ఏదైనా కొత్త రెస్టారెంట్ కు వెళ్లేటప్పుడు అక్కడి ఫుడ్ గురించి రీవ్యూలు చూసి వెళ్తాం. అక్కడికెళ్లిన కస్టమర్లు దాని గురించి రీవ్యూలు ఇస్తారు కాబట్టి దాన్ని బట్టి నిర్ణయించుకుంటాం వెళ్లాలో వద్దో.. కానీ చైనాలో ఒక రెస్టారెంట్ ఓనర్ మాత్రం తన హోటల్ ఫుడ్‌కు తానే రివ్యూ ఇచ్చుకుంటున్నాడు.


ఎక్కడైనా రెస్టారెంట్ వాళ్లే మా ఫుడ్ చెత్తగా ఉంటుందని చెప్పుకుంటారా? కానీ చైనాలోని ఆంట్ దాయ్ రెస్టారెంట్ ఓనర్ ఫెయ్ గాంగ్ ఫెయ్.. తన రెస్టారెంటులో ఆరెంజ్ బీఫ్.. అంత రుచిగా ఉండదని అంటున్నాడు. అలాగే సింగపూర్ నూడుల్స్ లో కర్రీ ఫ్లేవర్ ఉంటుందని, అది కూడా అంత బాగోదని ముందే చెప్పేస్తున్నాడు. ఇంకా తన రెస్టారెంట్ లో స్టాటే సాస్ బీఫ్ అనే వంటకాన్ని కొత్తగా మెనూలో చేర్చామని, చాలా మంది కస్టమర్లకు ఈ రెసిపీ అంటే పిచ్చి అని, కానీ ఇప్పటివరకూ దాని టెస్టు ఎలా ఉందో నేను ట్రై చేయలేదని ఓపెన్ గా చెప్తున్నాడు.


ఫెయ్ ఇలా నిజాయితీగా ఉండడాన్ని కస్టమర్లు మెచ్చుకుంటున్నారు. అతని రెస్టారెంట్ ఫుడ్ మెనూను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మరికొంత మంది ఇది తన హోటల్ పాపులర్ అయ్యేందుకు చేస్తున్న ట్రిక్ ఏమో అని కామెంట్ చేస్తున్నారు.

- Advertisement -

Latest news

Related news