29.3 C
Hyderabad
Monday, March 1, 2021

పాక్ కెప్టెన్ బాబర్ మీద లైంగిక వేధింపుల కేసు నమోదు

పాకిస్తాన్‌ క్రికెట్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్ చిక్కుల్లో పడ్డారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ యువతిని మోసం చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో లాహోర్‌ అదనపు సెషన్స్‌ కోర్టు బాబర్‌ మీద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. గతేడాది నవంబర్‌లో లాహోర్‌కు చెందిన హమీజా ముక్తార్‌ అనే మహిళ, బాబర్‌ తనను పెళ్లాడతానని 2010లో ప్రపోజ్ చేశాడని చెప్పింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. శారీరకంగా వాడుకుని వదిలించుకోవాలని చూశాడని.. బలవంతంగా అబార్షన్‌ కూడా చేయించాడని ఆరోపించింది. ఈ నేపథ్యంలో హమీజా‌ తరఫు న్యాయవాది ఇందుకు సంబంధించిన వైద్య పత్రాలను సాక్ష్యంగా కోర్టుకు సమర్పించారు. ఇరు వర్గాల వాదనలు విన్న అదనపు సెషన్స్‌ కోర్టు న్యాయూర్తి నోమన్ ముహమ్మద్ నయీమ్ పాక్ క్రికెట్ కెప్టెన్ బాబర్‌ మీద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిందిగా‌ నసీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓను ఆదేశించారు.
బాబర్ మీద లైంగిక ఆరోపణలు తీవ్రంగా, కలవరపరిచే విధంగా ఉన్నాయన్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. కేసును ఉపసంహరించుకోవాల్సిందిగా తనకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని గతంలో హమీజా ఆరోపించింది. మరో అదనపు సెషన్స్ జడ్జి అబిద్ రాజా బాబర్, అతడి కుటుంబ సభ్యులను హెచ్చరించారు. బొటనవేలు గాయం కారణంగా న్యూజిలాండ్‌లో మొత్తం సిరీస్‌ను కోల్పోయిన బాబర్ ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరిగే హోమ్ టెస్ట్, టీ 20 సిరీస్‌కు సిద్ధమవుతున్నాడు.

- Advertisement -

Latest news

Related news