29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

ఫ్రెంచ్ సైక్లిస్ట్ ఫీట్ అదుర్స్

30 నిమిషాల్లో 30 అంతస్తులు ఎక్కిన ఫ్రెంచ్ సైక్లిస్ట్ అరిలిన్ చేసిన ఫీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మౌంటెన్ బైకర్ అయిన అరిలిన్ ఓ మంచి పని కోసం ఈ ఫిట్ చేశాడు. ఫాంటెనయ్ ట్రినిటీ టవర్ లో 33 అంతస్తులను కాలు కింద పెట్టకుండా కేవలం సైకిల్ పైనే ఎక్కి ఔరా అనిపించాడు. మొత్తం 768 మెట్లను సైకిల్ తో జంపులు చేస్తూ ఎక్కాడు. కాలు కింద పెట్టకుండా చేసిన ఈ ఫీట్ అదుర్స్ అంటూ.. నెటిజన్లు స్పందిస్తున్నారు. అనంతరం అరిలిన్ మాట్లాడుతూ.. పిల్లల చారిటీ కోసం కష్టమైన ఈ ఫీట్ చేసినట్లు అరిలీన్ చెప్పాడు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న, తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్న పిల్లలకు ఈ ఫీట్ ద్వారా వచ్చే పైసలను ఉపయోగించనున్నట్లు చెప్పుకొచ్చాడు.

- Advertisement -

Latest news

Related news