29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

భర్త మెడకు తాడు కట్టి కుక్కలా మార్చిన భార్య

వాళ్లింట్లో పెంపుడు కుక్క లేదేమో పాపం.. అ ఇంటావిడ తన భర్తనే కుక్కగా మార్చేసింది. భర్త మాత్రం అలా ఎలా ఒప్పుకున్నాడనేగా మీ సందేహం.. అసలు విషయమేంటంటే..


ఇప్పుడంటే మనకు లాక్ డౌన్ లేదు కానీ ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు పడ్డామో గుర్తుందిగా.. ఇప్పుడు అలాంటి కష్టాలే పడుతున్నారు కొన్ని దేశాల్లో. ఇంట్లో నుంచి అసలు బయటకే రానివ్వని పరిస్థితి. కెనడాలో కూడా ఇంతే.. ఎవ్వరూ బయటకు రాకూడదని స్ట్రిక్ట్ రూల్స్ నడుస్తున్నాయక్కడ. అయితే పెట్స్ ను మాత్రం వాకింగ్‌కు తీసుకెళ్లొచ్చు.

అయితే అప్పటిదాకా ఇంట్లో ఉండి ఉండి విసిగిపోయిన కెనడాలోని ఓ జంట పెట్స్ తీసుకెళ్లొచ్చు అనే చిన్న లూప్ తో పోలీసులను బోల్తా కొట్టించొచ్చు అనుకుని ఓ వెరైటీ ప్లాన్ వేశారు. భర్త కుక్కలా మెడకు తాడుకట్టుకుని నడుస్తుంటే.. భార్య అతన్ని నిడిపిస్తూ అలా వీధిలోకెళ్లొచ్చనుకున్నారు. ఐడియా కొత్తగా ఉండడంతో భర్త కూడా ఓకే అన్నాడు. అనుకున్న విధంగానే ప్లాన్ అమలు చేశారు. భర్త మెడకు చైను కట్టి.. ఆ చైన్ పట్టుకుని భార్య నడుస్తూ వీధుల్లో నడుస్తున్నారు. ఈ సీన్ చూసి పోలీసులకు మైండ్ బ్లాక్ అయింది. లాక్‌డౌన్ సమయంలో ఇలా బయటకు రాకూడదని, జరిమానా చెల్లించాలని తెలిపారు. ఇందుకు ఆమె జవాబిస్తూ.. లాక్‌డౌన్‌లో కుక్కలను వాకింగ్ తీసుకెళ్లవచ్చని రూల్‌లో ఉంది. నేను అదే చేశాను. తప్పేంటి? పోలీసులను తిరిగి ప్రశ్నించింది. తప్పే, ఎందుకంటే.. నువ్వు తీసుకొచ్చినది కుక్కను కాదు, నీ భర్తను. కాబట్టి జరిమానా చెల్లించాల్సిందే అని పోలీసులు గట్టిగా చెప్పారు. చేసేదేమీ లేక ఇద్దరూ కలిపి 3వేల డాలర్లు (సుమారు 2 లక్షలు) చొప్పున జరిమానా చెల్లించారు. అలానే మరికొంతమంది కుక్క బొమ్మలను వాకింగ్‌కు తీసుకెళ్లి ఫైన్ కట్టారు. కెనడాలో ఇదీ పరిస్థితి.

- Advertisement -

Latest news

Related news