29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

రికార్డు వేగంతో కరుగుతున్నమంచు

భూమిపై మంచు వేగంగా కరిగిపోవడం ఆందోళన పెంచుతుంది. క్రియోస్పీయర్‌ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం 1994-2017 మధ్య భూమిపై 28 ట్రిలియన్‌ టన్నుల మంచు కరిగిపోయింది. 1990లో ఏడాదికి 0.8 ట్రిలియన్ టన్నుల మంచు కరిగితే.. అదే 2017 నాటికి 1.3 ట్రిలియన్ టన్నులకు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా మంచు కరగడంపై శాలిలైట్‌ డేటా ఆధారంగా యూకేలోని లీడ్స్‌ యూనివర్సిటీ బృందం ఈ నివేదిక తయారు చేసింది.

గత 23 ఏండ్లలో మంచు కరిగే రేటు 65 శాతం పెరగడం ఆందోళన కలిగిస్తోందని నివేదిక స్పష్టం చేసింది. ఈ స్థాయిలో మంచు కరగడం వల్ల సముద్ర మట్టాలు పెరుగుతున్నాయని, సముద్రతీర ప్రాంతాలు వరద ప్రభావానికి గురవుతున్నట్లు వెల్లడించారు. దీంతో వీటిపై ఆధారపడ్డ వన్యప్రాణులు, జీవజాతులు మరింత వేగంతో అంతరించే ప్రమాదం ఉందని చెప్పారు.  భూమిపై విస్తరించి ఉన్న 2,15,000 పర్వత హిమానీనదాలు, గ్రీన్‌లాండ్‌, అంటార్కిటాకాలోని ధ్రువ మంచు పలకలపై ఈ అధ్యయనం కొనసాగింది.

- Advertisement -

Latest news

Related news