ఈరోజుల్లో గూగుల్, ఇంటర్నెట్ లేకపోతే సర్వం స్తంభించిపోతది. అలాంటిది దాదాపు గంటసేపు గూగుల్ సేవలన్నీ నిలిచిపోతే ఎలా ఉంటుంది? ప్రపంచంలోని ప్రధాన సేవలన్నీ గూగుల్ మీదనే ఆధారపడి నడుస్తున్నాయి. అయితే.. ఈరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి దాదాపు గంటసేపు గూగుల్ సేవలు నిలిచిపోయాయి. గూగుల్ సెర్చ్, జీమెయిల్, డ్రైవ్, యూట్యూబ్, డాక్స్, ఫొటోస్, కాంటాక్ట్స్, హ్యాంగవుట్స్ ఇలా గూగుల్ సేవలన్నింటిలో.. టెంపరరీ ఎర్రర్ అనే కోడ్ మెసేజ్ గంటసేపు రాజ్యమేలింది.
గూగుల్ ఉత్పత్తులైన జీమెయిల్, యూట్యూబ్ ఈ మధ్య తరచుగా సర్వర్ డౌన్ అవుతున్నాయి. కాకపోతే.. ఈరోజు సాయంత్రం ఐదు గంటల తర్వాత ఒక్కో గూగుల్ సర్వీస్ నిలిచిపోతూ వచ్చాయి. ఈ ఎఫెక్ట్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 కోట్ల మంది మీద పడిందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. గూగుల్ సేవలు నిలిచిపోవడం వల్ల ట్విట్టర్, ఫేస్ బుక్ లలో గూగుల్ డౌన్, సర్వర్ డౌన్, జీమెయిల్ డౌన్, యూట్యూబ్ డౌన్ అంటూ హాష్ ట్యాగ్స్ తో వరుస ట్వీట్లు పెట్టారు. కొందరైతే.. నవ్వులు పూయించే మీమ్స్ ట్వీట్ చేశారు.