29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

ఆమె కేసులకు భయపడే టైపు కాదు

రైతు ఉద్యమానికి మద్దతు తెలుపుతూ.. ట్వీట్ చేసిన సామాజిక కార్యకర్త గ్రెటా థంబర్గ్ పై రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టారంటే ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసిన కొద్దిసేపటికే.. గ్రెటా థంబర్గ్ మరో ట్వీట్ చేశారు. ఢిల్లీలో కొనసాగుతున్న రైతుల ఉద్యమానికి తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నానని.. శాంతియుత నిరసనలకు తన మద్దతు ఎప్పటికీ ఉంటుందని స్పష్టం చేశారు. ఆమె చేసిన ట్వీట్ ను వ్యతిరేకంగా పలువురు సెలబ్రిటీలు కామెంట్ చేస్తూ పెట్టిన ట్వీట్లు పెట్టిన విషయం తెలిసిందే.
రైతులను రెచ్చగొట్టేలా గ్రెటా ట్వీట్ చేసిందని ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసిన కొద్దిసేపటికే ఆమె.. మరో ట్వీట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రోజురోజుకు రైతు ఉద్యమానికి అంతర్జాతీయ స్థాయి ప్రముఖులంతా మద్దతు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. భారత ప్రభుత్వం కూడా ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Latest news

Related news