25.6 C
Hyderabad
Saturday, January 16, 2021

ఇక నైపుణ్యం ఆదారంగానే హెచ్‌-1బీ వీసాలు

నైపుణ్యం ఉన్న విదేశీ వర్కర్లకు ప్రయోజనం కలిగించేలా అమెరికా నిర్ణయం తీసుకుంది. హెచ్‌-1బీ వీసా ఎంపిక ప్ర‌క్రియ‌లో మార్పులు తీసుకొచ్చింది. లాట‌రీ ప‌ద్ధ‌తికి స్వ‌స్తి చెప్పి జీతం, నైపుణ్యం ఆధారంగా వీసాలు ఇవ్వ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. ఫెడ‌రెల్ రిజిస్ట‌ర్‌లో శుక్రవారం నమోదు చేశారు. దీంతో ఈ నిబంధన 60 రోజుల తర్వాత అమల్లోకి రానుంది. ఏప్రిల్ 1 నుంచి హెచ్‌-1బీ వీసా ఫైలింగ్ సీజ‌న్ ప్రారంభ‌మ‌వుతుంది.

అమెరికాలో హెచ్‌-1బీ వీసాలపై పనిచేస్తున్న వారిలో ఇండియా, చైనా వారే ఎక్కువగా ఉన్నారని యూఎస్‌సీఐఎస్ డిప్యూటీ డైరెక్ట‌ర్ ఫ‌ర్ పాల‌సీ జోసెఫ్ ఎడ్లో చెప్పారు. వీసా జారీ ప్ర‌క్రియ‌ను మార్చ‌డం వ‌ల్ల అమెరికా కంపెనీలు మ‌రింత నైపుణ్యం ఉన్న ప్రొఫెష‌న‌ల్స్‌ను భారీగా జీతాలు చెల్లించి తీసుకోవాల్సి వ‌స్తుందని, దీంతో అమెరికన్లకు మేలు జరుగుతుందన్నారు. ఏడాదికి గ‌రిష్ఠంగా 65 వేల హెచ్‌-1బీ వీసాలతోపాటు స్టెమ్ సబ్జెక్టుల్లో అమెరికా యూనివ‌ర్సిటీలో ఉన్నత చ‌దువులు పూర్తి చేసిన విదేశీ విద్యార్థుల‌కు అద‌నంగా 20 వేల హెచ్‌-1బీ వీసాల‌ను జారీ చేస్తారు.

- Advertisement -

Latest news

Related news

1020వ గుండెను కాపాడిన సూపర్ స్టార్

సాటివారికి సాయం చేయడంలో ముందుండే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లోనే కాదు.. తాను నిజంగా కూడా శ్రీమంతుడినే అని నిరూపించుకున్న సంఘటనలు బోలెడున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. గత...

తొలి బర్డ్ ఫ్లూ కేసు.. నేషనల్ పార్క్ బంద్

ఢిల్లీలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. నగరంలోని నేషనల్ జువాలాజికల్ పార్క్ లో గత సోమవారం ఓ గుడ్లగూబ మరణించింది. దీని శాంపిల్స్ ను భోపాల్ లోని ఐసీఎఆర్...

టైలర్ గా సోనూసూద్..

కరోనా సమయంలో తన స‌మాజ‌సేవతో దేశంలో రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు సోనూసూద్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సోనూ.. తాజాగా ఓ ఫన్నీ వీడియోను పంచుకున్నాడు....

విజయ్ సేతుపతి బర్త్ డే పోస్టర్ అదిరిపోయిందిగా..

విజయ్ సేతుపతి పుట్టినరోజు సందర్భంగా ఉప్పెన టీమ్ ఆయనకు బర్త్ డే విషెస్ చెప్తూ.. విజయ్ సేతుపతి కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. పంజా వైష్ణవ్ తేజ్‌, కృతిశెట్టి జంట‌గా...