29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

లాటరీ ద్వారానే హెచ్1 బీ వీసా

అమెరికాలో విదేశీయులు ఉద్యోగాలు చేయడానికి వీలుకల్పించే హెచ్‌ 1బీ వీసాల విషయంలో ట్రంప్‌ తీసుకొచ్చిన మార్పుల్ని బైడెన్‌ ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ ఏడాది కూడా సంప్రదాయ లాటరీ విధానం ద్వారా వీసాలు జారీ చేయనున్నట్టుగా ప్రకటించింది.
ఈ ఏడాది డిసెంబర్‌ 31వరకు వీసాల మంజూరు విషయంలో లాటరీ విధానమే అమల్లో ఉంటుందని అమెరికా సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) చెప్పింది.
హెచ్‌–1బీ వీసాతో అమెరికాలో విదేశీయులు ఉద్యోగాలు చేసుకోవచ్చు. దీనివల్లనే అక్కడి లోకల్ అమెరికన్లకు ఉద్యోగాల కొరత ఏర్పడుతుందని ట్రంప్ ఈ వీసాలపై కఠినంగా వ్యవహరించారు. కంప్యూటరైజ్డ్‌ లాటరీకి బదులు ప్రతిభ ఆధారిత వీసా విధానాన్ని తీసుకువచ్చారు. అయితే ఇప్పుడు దీన్ని వాయిదా వేస్తూ బైడెన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

Latest news

Related news