ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా హిమాలయాలు కరగడం డబులైందట. ముఖ్యంగా 2000 సంవత్సరం నుంచి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు హిమాలయాలపై అధిక ప్రభావాన్ని చూపుతుందని పరిశోధకులు అంచనా వేశారు. ఈ విషయాన్ని తేల్చేందుకు గత 40 సంవత్సరాలు శాటిలైట్ ఇమెజ్ లను వారు అధ్యయనం చేశారు. ఈ మేరకు జనరల్ సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్ లో 2019లో ప్రచురణ అయిన ఓ అధ్యయనం ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.
భారత్, చైనా, నేపాల్, భూటాన్ దేశాల్లోని 2,000 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న హిమాలయ పర్వత శ్రేణుల్లోని 650 హిమానీనదాలపై పరిశోధన సాగింది. ఈ దేశాల్లో పెరుగుతున్న కాలుష్యం, ఉష్ణోగ్రతలు హిమాలయలపై అధిక ప్రభావం చూపుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
1975 నుండి 2000 వరకు 0.25 మీటర్ల మేర మంచు కరిగితే.. 2000 నుంచి 2016 వరకు 0.50 మీటర్ల మేర మంచు కరిగినట్లు అధ్యయనం పేర్కొంది. జాగ్రత్తలు తీసుకోకుంటే రాబోయే కొన్ని సంవత్సరాల్లో హిమాలయ పర్వాతాల్లోని నాలుగో వంతు మంచు కరుగవచ్చని పరిశోధనలో పాల్గొన్న అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన పీహెచ్డీ అభ్యర్థి జాషువా మౌరర్ ఆందోళన వ్యక్తం చేశారు.