31.5 C
Hyderabad
Monday, March 1, 2021

యుద్ధాలు చేయని ప్రెసిడెంట్ గా గర్వపడుతున్నాను..

గత కొన్ని దశాబ్దాల చరిత్రలో ఎలాంటి యుద్ధాలు ప్రారంభించని తొలి ప్రెసిడెంట్ గా గర్వపడుతున్నానంటూ డొనాల్డ్ ట్రంప్ మంగళవారం విడుదల చేసిన తన చివరి సందేశంలో ప్రస్తావించారు. అదే విధంగా అమెరికా ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహించడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. రాబోయే  టీం అమెరికాను గొప్పగా తీర్చిదిద్దాలని, వారి ప్రయాణానికి లక్ తోడుగా ఉండాలని ప్రార్థిస్తున్నానన్నారు. చైనాకు వ్యతిరేకంగా వివిధ దేశాల మద్దతు కూడగట్టడంతోపాటు అమెరికా విదేశాంగ విధానాన్ని మరింత పటిష్టంగా చేశానన్నారు.

క్యాపిటల్ భవనంపై దాడిపై ట్రంప్ విచారణ వ్యక్తం చేశారు. ప్రజా స్వామిక దేశాల్లో భిన్నభిప్రాయాలు ఉండటం సహజం, కానీ అసమ్మతి వాదుల గొంతును అణచి వేయాలనుకోవడం అమెరికా విలువలకే విరుద్ధమంటూ.. పరోక్షంగా తనపై ట్విటర్, ఫేస్ బుక్, యూట్యూబ్ బ్యాన్ చేయడాన్ని ప్రస్తావించారు. అమెరికాకు మంచి రోజులు వస్తాయన్న విశ్వాసంతో వెళ్తున్నాను.. అని ట్రంప్ తన చివరి ప్రసంగాన్ని ముగించారు.

భారత కాలమానం ప్రకారం ఇరోజు రాత్రి 10.30 నిమిషాలకు బైడెన్ అమెరికా కొత్త ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపడతారు. అంతకంటే ముందే ట్రంప్ వైట్ హౌజ్ వదిలి ఫ్లోరిడాలోని తన సొంత ఇంటికి  వెళ్తారు.

- Advertisement -

Latest news

Related news