21.2 C
Hyderabad
Monday, January 18, 2021

అభిశంసనకు గురైన ట్రంప్..

అమెరికా పార్లమెంట్ భవనం ‘క్యాపిటల్ హిల్’పై దాడికి తన మద్దతుదారులను రెచ్చగొట్టిన ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా ప్రెసిడెంట్ డొనాల్ట్‌ ట్రంప్ ప్రతినిధుల సభలో అభిశంసనకు గురైయ్యారు. ఈ మేరకు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ 232-197 ఓట్ల తేడాతో ఆమోదించింది. ఈ తీర్మానం ఆమోదంతో అమెరికన్‌ పార్లమెంటులోని రెండు సభల్లో ప్రతినిధుల సభ లో అభిశంసన పూర్తయినట్లయింది. తర్వాత  సెనేట్‌లోనూ ట్రంప్‌పై అభిశంసన ప్రక్రియను చేపడతారు.

అత్యవసర భేటికి నో..

కానీ సెనేట్ కు ప్రస్తుతం సెలవులు ప్రకటించారు. జనవరి 19న సెనేట్ సమావేశం అవుతుంది. ట్రంప్‌పై అభిశంసన ప్రక్రియను చేపట్టేందుకు వీలుగా అత్యవసర సమావేశం నిర్వహించేందుకు సెనేట్‌ లోని రిపబ్లికన్ ప్రతినిధులు ఒప్పుకోలేదు. జనవరి 19న సెనేట్‌ తిరిగి సమావేశం తర్వాతే ట్రంప్ భవిష్యత్ పై స్పష్టత వస్తుంది. జనవరి 20న అమెరికా కొత్త ప్రెసిడెంట్ గా బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

రిపబ్లికన్లదే ఆధిక్యం

ట్రంప్ ని అభిశంసించిన ప్రతినిధుల సభలో సంఖ్య పరంగా డెమోక్రాట్లు  అధికంగా ఉన్నారు. కానీ సెనేట్‌లో మాత్రం రిపబ్లికన్ల ఆధిక్యం ఉంది. రిపబ్లికన్లలో చాలా మంది ట్రంప్‌ను వ్యతిరేకిస్తున్న ఆయనపై తక్షణ చర్యలకు వారు కూడా సిద్ధంగా లేరు. సెనేట్‌లో ఉన్న 100 మంది సభ్యుల్లో మూడింట రెండో వంతు అంటే 67 మంది మద్దతు ఇస్తే ట్రంప్‌ అభిశంసనకు గురవుతాడు. అదే ట్రంప్‌ను 2024లో ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆపాలంటే మాత్రం సాధారణ మెజారిటీ అయిన 51 మంది సభ్యులు మద్దతు ఇస్తే సరిపోతుంది.

- Advertisement -

Latest news

Related news

బట్టతలకు రాకుండా ఉండాలంటే..

బట్టతల.. ఈ మాట వింటేనే చాలామందికి భయమేస్తుంది. ఒక్కసారి బట్టతల వచ్చిందంటే ఇక అంతే.. జుట్టంతా ఎక్కడ రాలిపోతుందో అని బెంగ పెట్టుకుంటారు. అసలీ బట్ట తల ఎలా వస్తుంది?...

ఫ్లిప్‌కార్ట్ అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ సేల్స్

రిపబ్లిక్ డే వస్తుందంటే ఈ కామర్స్ సైట్లు భారీగా ఆఫర్లు ప్రకటిస్తాయి. ఈ సారి కుడా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు డిస్కౌంట్ సేల్స్‌ను అనౌన్స్ చేశాయి. అమెజాన్...

కోవిడ్19 సోకిన గబ్బిలం కుట్టిందన్న చైనా సైంటిస్ట్

కోవిడ్-19 సోకిన గబ్బిలాలు తమను కుట్టినట్లు వూహన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) శాస్త్రవేత్తలు చెప్పారని ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది.

స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీనే బెస్ట్

అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా గుజరాత్ లోని కెవాడియాలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ కే ఎక్కువమంది టూరిస్టులు వచ్చారని ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రెండేళ్ల క్రితం...