32.3 C
Hyderabad
Thursday, February 25, 2021

బార్బడోస్, డొమినికా దేశాలకు బాసటగా ఇండియా

కోవిడ్-19 కారణంగా కుదేలైన పేద దేశాలకు భారత్ బాసటగా నిలుస్తోంది. పేద దేశాలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందజేస్తూ ఉదారతను చాటుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా ఆఫ్రికా దేశాలైన బార్బడోస్‌, డొమినికా దేశాలకు వ్యాక్సిన్లను పంపింది. ఆదివారం రాత్రి 11:35 గంటలకు ముంబై నుంచి ప్రత్యేక విమానంలో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా తయారుచేసిన కోవిషీల్డ్‌ డోసులను తరలించారు. ఈ సందర్భంగా బార్బడోస్ దేశ ప్రధాని మియా మోట్లీ కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా వ్యాక్సిన్ డోసులు ఇచ్చిన దేశాల్లో అమెరికా, బ్రిటన్ తర్వాత ఇండియా మూడో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.

- Advertisement -

Latest news

Related news