29.3 C
Hyderabad
Monday, March 1, 2021

చైనా సైనికులను తరిమి కొట్టారు

ఒకవైపు చర్చలు జరుగుతుండగానే సిక్కింలో ఇండియా, చైనా సైనికుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. మూడు రోజుల క్రితం సిక్కింలోని నాకు లా ప్రదేశం గుండా చైనా సైనికులు భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అయితే ఈ ప్రయత్నాలను మన బలగాలు గట్టిగానే అడ్డుకున్నాయి. చైనా సైనికులను అడ్డుకునే ప్రయత్నంలోనే ఇరు దేశాల సైనికులకు ఘర్షణ తలెత్తింది. ఇందులో నలుగురు భారత సైనికులు గాయపడగా, 20 మంది చైనా సైనికులు గాయాలపాలయ్యారు. అయితే ప్రస్తుతం అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయని, పరిస్థితి మాత్రం పూర్తి అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Latest news

Related news