29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

1,178 ఖాతాలు నిలిపివేయాలని.. ట్విట్టర్ కు కేంద్రం ఆదేశాలు

సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళన సోషల్ మీడియా చాలా చురుగ్గా రైతుల ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నది. పాపులర్ ర్యాప్ సింగర్ రిహన్నా ట్వీట్ తో రైతుల ఉద్యమం గురించి అంతర్జాతీయ స్థాయిలో మరోసారి చర్చకు వచ్చింది. అయితే.. సోషల్ మీడియాలో రైతుల ఉద్యమానికి పెరుగుతున్న మద్దతు పట్ల కేంద్ర ప్రభుత్వం కోపంతో ఊగిపోతున్నది. ఇప్పటికే చాలా సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేయించగా.. తాజాగా వెయ్యికి పైగా ట్విట్టర్ ఖాతాలను తొలగించాలని ట్విట్టర్ కు ఆదేశాలు జారీ చేసింది.
1,178 ట్విట్టర్ ఖాతాల్లో రైతుల ఉద్యమం గురించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం అప్డేట్ అవుతోంది. ఉద్యమ కార్యాచరణ, ఆందోళనలకు సంబంధించిన అప్డేట్లు, ఫొటోలు, వీడియోలు ఆయా ఖాతాల్లో ఎప్పటికప్పుడు పోస్ట్ అవుతున్నాయి. అయితే.. పాకిస్థానీ, ఖలిస్థానీ యూజర్లే ఇదంతా చేస్తున్నారన్న సాకుతో కేంద్ర ఐటీ శాఖ ట్విట్టర్ కు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల మేరకు ఐటీ శాఖ ట్విట్టర్ కు ఆదేశాలు జారీ చేయగా.. ట్విట్టర్ ఇంకా స్పందించలేదు.
భారత చట్టాల ఉల్లంఘనకు పాల్పడితే చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేసింది. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీల్లో జరుగుతున్న రైతుల ఆందోళనపై కొందరు సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ట్వీట్లు చేస్తున్నారని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్‌ మంత్రిత్వశాఖ పేర్కొంది. అలా తప్పుడు సమాచారం చేరవేసే ఖాతాలను నిలిపివేయాలని, ఆ ట్వీట్లను వెంటనే తొలగించాలని గతవారం ట్విట్టర్‌ను ఆదేశించింది. కేంద్ర ఐటీశాఖ ఆదేశాల అనుసారం 250 ట్వీట్లు/ఖాతాలను బ్లాక్‌ చేసిన ట్విట్టర్‌.. కొద్ది గంటల తర్వాత తిరిగి వాటిని పునరుద్ధరించింది. దీంతో కేంద్రప్రభుత్వం ట్విట్టర్ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతుల ఆందోళనకు మద్దతుగా చేసిన కొన్ని ట్వీట్లను స్వయంగా ట్విట్టర్‌ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సీ లైక్‌ చేయడం కొసమెరుపు.

- Advertisement -

Latest news

Related news