మంగళవారం రాత్రి పాకిస్తాన్ భూభాగంలో సర్జికైల్ స్ట్రైక్స్ నిర్వహించినట్లు ఇరాన్ ఎలైట్ రెవల్యూషనరీ గార్డ్స్(ఐఆర్జీసీ) ప్రకటించింది. పాకిస్తాన్‌లోని బెలూచిస్తాన్‌లో జైష్ ఉల్–అదల్ అనే ఉగ్రవాద సంస్థ ఆధీనంలో ఉన్న తమ ఇద్దరు బోర్డర్ గార్డులను స్ట్రైక్స్ చేసి విడిపించుకెళ్లింది. పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న వాహాబీ టెర్రరిస్టు గ్రూప్ జైష్ ఉల్–అదల్ 2018 అక్టోబర్ 16న 12 మంది ఇరాన్ బోర్డర్ గార్డులను అపహరించింది. వారిని సురక్షితంగా విడిపించేందుకు ఇరాన్, పాక్ దేశాల మిలటరీ అధికారులు ఒక జాయింట్ కమిటీని ఏర్పాటు చేశారు. మిలటరీ ఆపరేషన్లు నిర్వహించి ఇప్పటివరకు దాదాపు 10 మందిని ఐఆర్జీసీ గార్డులను విడిపించగలిగారు. తాజాగా ఇరాన్ సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ చేసు మిగిలిన ఇద్దరిని కూడా రక్షించింది. ఉగ్రవాద సంస్థ జైష్ ఉల్–అదల్.. ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేస్తోంది. ఇరాన్‌లోని బలూచ్ సున్నీల హక్కులను కాపాడడానికి తాము పోరాడుతున్నామని చెప్తోంది.