గిన్నిస్ బుక్ రికార్డుల్లో అదీ ఇదీ అని లేదు. ప్రపంచంలో ఏ పనిని అయినా కొత్తగా లేదా ఫాస్ట్ గా చేసి రకార్డుకెక్కొచ్చు. తాజాగా మైక్ జాక్ అనే వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత కారంగా ఉండే మిర్చిని తిని.. రికార్డు సృష్టించాడు.
కెనాడాకు చెందిన మైక్ జాక్.. ప్రపంచంలో అత్యంత కారంగా పేరు పొందిన ‘కరోలినా రీపర్’ అనే మిర్చిని తినేశాడు. ఒకేసారి మూడు మిరిపకాయలు నోట్లో వేసుకుని బరబరా నమిలేశాడు.
మూడు కరోలినా రీపర్ మిరపకాయలను 10 సెకన్లలో నమిలి మింగేసి.. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకెక్కాడు. అంతే కాదు ఈసారి ఏకంగా ఎనిమిది రీపర్ మిరపకాయలు తిని..రికార్డు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.
కరోలినా రీపర్ అనేది మిరపకాయలోని ఒక రకం. అయితే ఇది ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపకాయగా గుర్తింపు పొందింది. గతంలో ఇదే మిరపకాయలను పోటీలో భాగంగా నమిలి మింగేసిన ఒక వ్యక్తికి తీవ్రమైన తలనొప్పి, వికారంతో బాధపడ్డాడు.
