ఈ ప్రపంచంలో కరోనా అంటే తెలియని వాళ్లుంటారా.. మొత్తం మానవాళి చరిత్రలోనే ఇంత పెద్ద ప్యాండెమిక్ ఎప్పుడూ రాలేదు. అలాంటి కరోనా గురించి మచ్చుకైనా తెలియని వ్యక్తి ఒకడున్నాడు. అతనెవరంటే..
యూకేకి చెందిన 19 ఏళ్ల జోసెఫ్ కి.. కరోనా అంతగా వ్యాప్తి చెందకముందు.. మార్చి ఒకటవ తేదీన రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది. అతని తలకు గట్టి దెబ్బ తలగడంతో.. మెదడుకు తీవ్రమైన గాయమైంది. దాంతో అతను కోమాలోకి వెళ్లాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా.. అంటే 11 నెలల పాటు కోమాలోనే ఉండిపోయాడు. కోమా నుంచి బయటకొచ్చాక.. ప్రపంచమంతా వైరస్ వ్యాక్సినేషన్ జరుగుతుంది. యూకేలో ఇప్పటికే రెండుసార్లు ఈ వైరస్ విస్తరించడంతో అక్కడ పరిస్థితి కాస్త సీరీయస్ గానే ఉంది. కానీ అసలు 2020లో జరిగిన విషయలేవీ జోసెఫ్ కు తెలియకపోవడంతో.. అసలు ఏం జరుగుతుందో జోసెఫ్ కు అర్థం కాలేదు.
కోమా నుంచి కోలుకోగానే.. ఎంటి ఇదంతా అని చూస్తున్నాడు. కరోనా వైరస్ ఏంటి? అదెప్పుడడొచ్చింది? అని కొత్తగా అడుగుతున్నాడు. అక్కడున్నవాళ్లు అతనికి అర్థమయ్యేలా ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నారు. అతను పూర్తిగా కోలుకున్నాక మెల్లగా అన్నీ విషయాలు అర్థమయ్యేలా చెబుతామంటున్నారు అతని కుటుంబసభ్యులు.