చైనాలో కరోనా మరోసారి కలకలం రేపుతోంది. ఉత్తర చైనాలోని హెబీ ప్రావిన్స్‌లో షిజియాషాంగ్, జింగ్టాయ్ సిటీల్లో గత వారంలో 127 కొత్త కోవిడ్-19కేసులు, అదనంగా 183 అసింప్టోమాటిక్ ఇన్ఫెక్షన్లు కనిపించాయి. 2019 తర్వాత చైనాలో ఇన్ని కేసులు ఒకేసారి వెలుగుచూడటం ఇదే తోలిసారి కావడం గమనార్హం. దీంతో అప్రమత్తమైన చైనా ప్రభుత్వం ఆ రెండు నగరాల్లో లాక్ డౌన్ విధించింది. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకి రాకూడదని ఆదేశించారు. అలాగే హెబీ ప్రావిన్స్‌లోని నివాసితులు బీజింగ్‌లోకి ప్రవేశించకుండా ఆంక్షలు విధించారు.
