29.3 C
Hyderabad
Monday, March 1, 2021

బైడెన్‌కు మోదీ ఫోన్.. ఏం మాట్లాడుకున్నారంటే..

అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ తో తొలిసారిగా ప్రధాని మోదీ ఫోన్ లో మాట్లాడారు. బైడెన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఇద్దరూ నేతలు పలు అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో శాంతి, సుస్థిరతల గురించి చర్చించుకున్నారు. ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని, వాతావరణ మార్పుపై పోరాడాలని నిర్ణయించారు. “ప్రెసిడెంట్‌ బైడెన్, నేను న్యాయబద్ధ పాలనకు కట్టుబడి ఉన్నాం. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో శాంతి సుస్థిరతల కోసం వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాం” అని మోదీ ట్వీట్‌ చేశారు.

- Advertisement -

Latest news

Related news