29.3 C
Hyderabad
Monday, March 1, 2021

పార్టీ మాదంటే మాదంటున్నారు

నేపాల్ లో అధికార పార్టీ.. తాము గతంలో ఎంచుకున్న ప్రధానమంత్రినే పార్టీ నుంచి తొలగించింది. అసలేమయిందంటే..
నేపాల్ ప్రధాని ఖడ్గప్రసాద్ శర్మ సభ్యత్వాన్ని ఉపసంహరించినట్టు అధికార కమ్యూనిస్ట్ పార్టీ చీలక వర్గ అధికార ప్రతినిధి నారాయణ్ కాజీ శ్రేష్ఠ తెలిపారు. నిన్న నిర్వహించిన కేంద్ర కమిటీ సమావేశం తర్వాత ఈ ప్రకటన చేశారు. గత నెల 20న పార్లమెంటును రద్దు చేసిన ప్రధాని ఖడ్గప్రసాద్ ఓలి.. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంపై పార్టీలోని ఓ వర్గం కోపంగా ఉంది. అందుకే ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు.
పార్లమెంటును రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలన్న ఖడ్గప్రసాద్ నిర్ణయం తర్వాత నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ రెండుగా చీలిపోయింది. తర్వాత పార్టీపై హక్కు పూర్తిగా తమకే ఉంటుందని రెండు వర్గాలు వాదించుకుంటున్నాయి. ఎన్నికల సంఘం ఏం నిర్ణయం తీసుకుంటుంది, తమ పార్టీ ఎన్నికల గుర్తు అయిన ‘సూర్యడు’ ఎవరికి లభిస్తోంది అనే విషయంపై అందరూ ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

Latest news

Related news