బ్రిటన్, అమెరికా, దక్షిణాఫ్రికా దేశాల్లో కరోనా కొత్త వెర్షన్ ఆందోళనకర రీతిలో ప్రబలుతోంది. తాజాగా జపాన్ లోనూ కరోనా వైరస్ కొత్త వర్షన్ కలకలం రేపుతోంది. అయితే జపాన్ వెలుగుచూసిన కరోనా కొత్త వర్షన్ ప్రపంచ దేశాలకు భిన్నంగా ఉందన్న నివేదికలు మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్‌ను బ్రెజిల్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల్లో గుర్తించినట్లు జపాన్ వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఈ వైరస్‌పై సమగ్ర దర్యాప్తు చేయాలని శాస్త్రవేత్తలు, వైద్యులను ఆ దేశ ప్రభుత్వం ఆదేశించింది. జపాన్‌లో ఇప్పటికే బ్రిటన్, దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త రకం వైరస్ కేసులు 30 వరకు ఉన్నాయి. అత్యధికంగా కేసులు నమోదవుతుండడంతో దేశ రాజధాని టోక్యోలో అత్యవసర పరిస్థితి విధించారు. దీని ప్రభావం ఒలంపిక్స్ గేమ్స్‌పై పడే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. క్రీడా సంబరాలను వాయిదా.. లేక రద్దు చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.