59 ఏళ్ల బ్రిటిష్ ఎయిర్వేస్ పైలట్.. 243 రోజుల పాటు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొంది కోవిడ్ నుంచి రికవరీ అయ్యాడు. కోవిడ్ కేసుల్లో ఇంత టైం తీసుకుని రికవరీ అయిన మొదటి వ్యక్తి ఇతనే..

బ్రిటీష్ ఎయిర్వేస్ పైలట్ నికోలస్ సైనాట్ కు 59 ఏళ్లు. మార్చిలో హోస్టన్కు విమాన ప్రయాణం తర్వాత కాస్త అస్వస్థతకు గురయ్యాడు. తర్వాత శ్వాస సరిగ్గా అందకపోవడంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. డాక్టర్లు కరోనా అని తేల్చారు. శ్వాస ఆడకపోవడంతో వెంటిలెటర్ ద్వారా చికిత్స అందించారు. గుండె, ఊపిరితిత్తుల్లో సమస్యలు కూడా వచ్చాయి. అలా అతని శరీరంలోని ప్రతి అవయవం కరోనా వైరస్ వల్ల ఎఫెక్ట్ అయింది. దాంతో అతను అలా ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉండాల్సొచ్చింది. అలా మొత్తంగా 243 రోజుల పాటు చికిత్స తీసుకుని.. రీసెంట్గా డిశ్చార్జ్ అయ్యాడు. కరోనాతో అన్ని రోజుల పాటు చికిత్స పొందడం రికార్డు అంటున్నారు డాక్టర్లు. ఎలా అయితేనేం.. ఎట్టకేలకు పోరాడి వైరస్‌ను జయించగలిగాడు. ప్రస్తుతం ఇతని ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు చెప్తున్నారు.

తను కోలుకోవడంలో తన భార్య పాత్ర కీలకమని సైనాట్ ఇంకా డాక్టర్లు చెప్తున్నారు. తన ధైర్యం, భార్య, కుటుంబసభ్యుల సపోర్ట్‌తోనే తిరిగి కోలుకోగలిగినట్లు సైనాట్ తెలిపారు.