29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

ఫైజర్ వ్యాక్సిన్ వికటించి 23 మంది మృతి

ఇండియాలో అతిపెద్ద కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. మరోపక్క నార్వేలో కరోనా వ్యాక్సిన్ వికటించి విషాదం నెలకొంది. ఫైజర్, బయో ఎన్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 23 మంది మరణించగా.. మరో 23 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 21 మంది మహిళలు, 8 మంది పురుషులు ఉన్నారు. 80 ఏండ్లకు పైబడిన వారే అధికంగా చనిపోయారని డాక్టర్లు చెప్పారు. దీనిపై నార్వే గవర్నమెంట్ విచారణకు ఆదేశించింది. అధిక వయసు ఉన్నవారు వ్యాక్సిన్ తీసుకోవద్దని నార్వేజియన్ ఇన్స్ టి ట్యూట్ ఆఫ్ పబ్లిక్  హెల్త్ ప్రకటించింది. డాక్టర్లు సైతం ప్రజలకు దీనిపై సూచనలు జారీ చేయాలని సూచించింది.  

నార్వేలో ఇప్పటివరకు ఫైజర్ లేదా మోడెర్నా వ్యాక్సిన్ ని 30 వేలమందికి పైగా తీసుకున్నారు. నార్వే లో మరణాల నేపథ్యంలో యూరప్ కు తమ వ్యాక్సిన్ సరఫరాను తగ్గిస్తామని ఫైజర్ సంస్థ ప్రకటించింది. 80 ఏండ్లు పైబడిన వారిలో ఇతర ఆరోగ్య సమస్యలు ఉండవచ్చని,  బహుశా అవి కూడా వారి మరణానికి దారి తీసి ఉండొచ్చని సంస్థ పేర్కొంది.

- Advertisement -

Latest news

Related news