29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

మయన్మార్‌లో రాజకీయ సంక్షోభం

మయన్మార్‌లో మరోసారి రాజకీయ సంక్షోభం వచ్చింది. మరోసారి సైన్యం తిరుగుబాటు చేసి ఏడాది పాటు పాలనను తమ ఆధీనంలోకి తీసుకున్నట్టు ప్రకటించింది. సోమవారం తెల్లవారుజామున నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమోక్రసీ (ఎన్‌ఎల్‌డీ) నాయకురాలు, స్టేట్‌ కౌన్సిలర్‌ ఆంగ్‌ సాన్‌‌ సూకీతో పాటు ఆ దేశ ప్రెసిడెంట్ యు విన్‌మైంట్‌లను హౌజ్ అరెస్టు చేశారు. మయన్మార్ రాజధానిలో ముందస్తుగా మొబైల్, ఇంటర్ నెట్ సేవలను ఆపేశారు.

గత నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఎన్‌ఎల్‌డీ భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. అయితే ఈ ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరిగాయంటూ సైన్యం ఆరోపిస్తుంది. కానీ ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు జరుగలేదని, అక్రమాలపై ఎలాంటి ఆధారాలు లేవంటూ ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసింది. మయన్మార్ పార్లమెంట్‌ సమావేశాల ప్రారంభానికి కొద్ది గంటల ముందు సైన్యం తిరుగుబాటు చేయడంపై అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

- Advertisement -

Latest news

Related news