31.4 C
Hyderabad
Thursday, February 25, 2021

జగమంత కుటుంబం!

ఉమ్మడి కుటుంబం తెలుసు కానీ.. పాలిగామి ఫ్యామిలీ గురించి ఎప్పుడైనా విన్నారా? పాలిగామి అంటే ఎక్కువ మంది భార్యలుండడం. కానీ ఈ భార్యలంతా కలిసి ఒకేచోట ఓ పెద్ద ఫ్యామిలీగా ఉంటున్నారు. ఇదే ఇక్కడ విశేషం.


వివరాల్లోకెళ్తే.. కెనడాకు చెందిన విన్‌స్టన్ బ్లాక్‌మోర్‌కు 27 మంది భార్యలు, 150 మంది పిల్లలు ఉన్నారు. ఆ భార్యలు, వాళ్ల పిల్లలంతా కలిసి ఒకే చోట ఉంటున్నారు. ఈ మొత్తం ఫ్యామిలీ సిబ్లింగ్స్‌లో అందరికంటే పెద్ద అతని వయసు 44 ఏళ్లు. చిన్నోడి వయసు ఒక సంవత్సరం. ఈ ఫ్యామిలీలోని పిల్లలంతా కలిసి స్కూల్‌కి వెళ్లడం వల్ల వాళ్లకి క్లాస్‌మేట్స్, ఫ్రెండ్స్ ఎక్కువగా ఉండరని వాళ్లు చెప్తున్నారు.
వీళ్లంతా వాళ్ల సొంత మదర్‌ను ‘మామ్’ అని పిలిస్తే, మిగతా స్టెప్ మదర్స్‌ను ‘మదర్’ అని పిలుస్తారు. ఫ్యామిలీలో ఎవరి పుట్టినరోజున వచ్చినా అందరూ కలిసి జరుపుకుంటారు. ఇక వీళ్లుండేది కూడా ఒకే ఇంట్లో. అంతమంది సరిపోయేలా ఒక ‘మోటెల్ హౌజ్’లో ఉంటున్నారు. కూరగాయలు, ఫ్రూట్స్ లాంటివి వీళ్లే పండించుకుని తింటారు. చూడ్డానికి ఇది జగమంత కుటుంబంలా బాగానే ఉన్నా.. ‘పాలిగామి’ అనేది చాలా దేశాల్లో చట్ట విరుద్ధం.

- Advertisement -

Latest news

Related news